Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మరోసారి షారూఖ్ ఖాన్ కు షాక్ ఇచ్చిన ముంబై మున్సిపల్ అధికారులు!

  • ముంబైలోని గోరేగామ్ లో 'రెడ్ చిల్లీస్' కార్యాలయం 
  • ఇందులో నిబంధనలకు విరుద్ధంగా 2,000 చదరపు అడుగుల ఫ్లోర్ నిర్మాణం 
  • అక్రమ కట్టడంగా గుర్తించి కూల్చవేత   
  • గతంలో ఇంటి ముందు నిర్మించిన ర్యాంప్ ను కూడా కూల్చేశారు 
బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ కు బృహాన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు షాక్ ఇచ్చారు. షారూఖ్ కి చెందిన సినీ నిర్మాణ సంస్థ ‘రెడ్ చిల్లీస్’ కార్యాలయంలో అక్రమంగా నిర్మించిన ఫ్లోర్ ను బృహాన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు దగ్గరుండి కూల్చివేయించారు. ముంబైలోని గోరేగామ్ లో ‘రెడ్ చిల్లీస్’ ప్రధాన కార్యాలయాన్ని షారూఖ్ నిర్మించాడు. అందులో ప్రస్తుతం వీఎఫ్ఎక్స్ పనులు చేస్తున్నారు.

అయితే ఈ భవనంలోని నాలుగో అంతస్తులో నిబంధనలకు విరుద్ధంగా 2,000 చదరపు అడుగుల ఫ్లోర్ ను నిర్మించారు. దీనిని అక్రమ కట్టడంగా గుర్తించిన బృహాన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కూల్చేశారు. కాగా, 2015లో ముంబైలోని బాంద్రాలో గల తన నివాసం 'మన్నత్' ముందు, తన కారవాన్ వాహనం కోసం రోడ్డు మీదకి వచ్చేలా అక్రమంగా ర్యాంపు నిర్మించాడు. దీనిని కూడా అప్పట్లో బృహాన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కూల్చేశారు. రాత్రికి రాత్రే వారు కూల్చేయడం అప్పట్లో కలకలం రేపింది. 
sharukh khan
red challis entertainment
Mumbai

More Telugu News